ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్​కు వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. కేసుకు సంబంధించి 67 మంది సాక్షులను విచారించినట్లు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

sanjay-kumar
sanjay-kumar

By

Published : Oct 28, 2020, 3:33 PM IST

తెలంగాణ... ఈ ఏడాది మే 20న వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో పాడుపడిన బావిలో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమబంగా నుంచి వచ్చి.. వరంగల్​లో స్థిరపడిన మక్​సూద్ అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారు. మక్​సూద్ ఇంటి పక్కనే నివాసం ఉండే ఇద్దరు బిహారీ యువకులూ హత్యకు గురయ్యారు. కేసు మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితుడు సంజయ్​కుమార్​ను అరెస్ట్ చేశారు.

ఒక హత్యను కప్పి పుచ్చుకోవడానికి 9 హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలో ఉండగానే అందరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హత్యలు చేసినట్లు పోలీసులు నిరూపించారు. ఘటన జరిగిన నెలరోజుల్లోపే దర్యాప్తు పూర్తిచేసి పోలీసులు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు.

ఇవీచూడండి:ఎడ్ల బండిని ఢీకొన్న కారు... ఎద్దులు మృతి, నలుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details