రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి విశాఖజిల్లా ఎస్. రాయవరం మండలం డి.అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను... తుని నుంచి విశాఖ వైపు వెళ్లే లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అగ్రహారానికి చెందిన నవీన్, పండు, కార్తీక్ మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ లారీని నిలపకుండా వెళ్లిపోవడంతో... బాధితులు ముగ్గురూ ఇరుక్కుపోయి చనిపోయారు. మృతదేహాలను యలమంచిలి వరకు లారీ ఈడ్చుకుపోయాక గానీ జరిగిన ఘోరాన్ని డ్రైవర్ గుర్తించలేకపోయాడు. పొతిరెడ్డిపాలెం వద్ద లారీ నిలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.