బైకుల దొంగ అరెస్టు.. వాహనాలు స్వాధీనం - దొంగ
ఉభయగోదావరి జిల్లాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని... పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉభయగోదావరిలో వాహనాల చోరుడు అరెస్టు!
కొన్నేళ్లుగా గోదావరి జిల్లాల్లో మోటర్ సైకిళ్లను చోరీ చేస్తున్న... వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు శివారు గుడిపాడుకు చెందిన నేరేడుమెల్లి లక్ష్మణుడు.. 2 జిల్లాలలో పది ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. పెనుగొండ, పెనుమంట్ర, పాలకొల్లు, అమలాపురం, రాజమండ్రి ఏరియాల్లో ఈ చోరీలకు పాల్పడినట్లు పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.