ఆన్‌లైన్ జూదం ద్వారా మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. చరవాణిలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు తెరవగానే ఆన్లైన్లో కనిపించే పేకాట, రమ్మీ, తీన్ పత్తిల మోజులో విద్యార్థులు, యువకులు, వ్యాపారులు పడి లక్షల్లో కోల్పోతున్నారని చెబుతున్నారు.
దీంతోపాటు అప్పుల పాలవుతున్నట్లు వచ్చే ఫిర్యాదులు కూడా పెరిగాయని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించినా.. రమ్మీ కల్చర్ పేరుతో ఇంకా ఆన్లైన్లో కనిపిస్తూనే ఉందని.. ఆ వ్యసనానికి బలై మోసపోకూడదని పోలీసులు సూచిస్తున్నారు.