వర్షం కురుస్తోందని ఓ యువతి హైదరాబాద్లోని అమీర్పేట మెట్రో స్టేషన్ ఆవరణలో తలదాచుకుంది. ప్రమాదవశాత్తు మెట్రోస్టేషన్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో కంతాల మౌనిక తీవ్రంగా గాయపడింది. విషయం గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెట్రోస్టేషన్లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి - METRO STATION
వర్షానికి తడవకుండా... కాసేపు తలదాచుకుందామని మెట్రోస్టేషన్ అవరణలోకొచ్చి నిలబడింది. అదే తనపాలిట శాపంగా మారింది. ప్రమాదవశాత్తు మెట్రోస్టేషన్ పెచ్చులు ఊడి కంతాల మౌనిక అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.
one-women-died-foe-metro-pillar-accident