తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చింతల్చాందా గ్రామానికి చెందిన శేక్ ఖాజా రసూల్... మామడ మండలం ఆనంతపేట్లో సోమవారం మిత్రులతో కలసి విందు చేసుకున్నారు. మద్యం ఎవరు వేగంగా తాగగలరనే విషయమై మిత్రుల మధ్య చర్చ మొదలైంది. దీంతో 20 నిమిషాల వ్యవధిలో ఫుల్ బాటిల్ తాగితే రూ. 20 వేలు ఇస్తానంటూ షేక్ నగర్ బాషా, రత్తయ్య పందెం కాశారు.
ప్రాణం తీసిన పందెం.. మద్యం పోటీలో వ్యక్తి మృతి
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తలకెక్కడం లేదు కొందరికి! సరదా కోసమో, దర్జా కోసమో మద్యం తాగుతూ ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పంతానికి పోయి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడో వ్యక్తి. వేగంగా తాగితే రూ.20 వేలు ఇస్తామంటూ మిత్రులు పందెం వేశారు. దీంతో పంతానికి పోయి గటగటా తాగేశాడు. చివరికి ప్రాణాలొదిలాడు.
one-man-died-due-to-liquor-game-in-nirmal-district
ఈ పందెం పంతానికి పోయి ఖాజా రసూల్ సీసాలోని మొత్తం మద్యాన్ని తాగేశాడు. ఫలితంగా స్పృహ కోల్పోయాడు. వెంటనే 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పందెం కాసిన షేక్ నగర్ బాషా, రత్తయ్యపై కేసు నమోదుచేసినట్లు సోన్ సీఐ జీవన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:అక్రమంగా తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత