ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విషాదం: రోడ్డు ప్రమాదంలో తొమ్మిది నెలల బాలుడు మృతి

తొమ్మిది నెలల బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విశాఖపట్నం జిల్లా కశింకోటలో జరిగింది. కళ్ల ముందే తమ కుమారుడు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

nine-months-baby-death
nine-months-baby-death

By

Published : Sep 18, 2020, 9:09 AM IST

మునగపాక మండలం చిన్నోడుపాలెం గ్రామానికి చెందిన నాయుడు, నాగమణి దంపతులు. వీరికి విష్ణువర్థన్(9నెలలు) సంతానం. విష్ణువర్థన్ ఆధార్ కార్డ్ నమోదుకు ద్విచక్రవాహనంపై కశింకోటకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా... కశీంకోట జాతీయ రహదారి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చిన్నారిని విశాఖ కేజీహెచ్​కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విష్ణువర్థన్ మృతి చెందాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో నాయుడు, నాగమణి రోదించిన తీరు పలువురిని కట్టతడి పెట్టించింది.

ABOUT THE AUTHOR

...view details