దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి - MOTHER KILLED HER CHILDREN
తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను సద్దల చెరువులోకి తోసేసింది. ఘటనలో కుమారుడి మృతదేహం లభ్యం కాగా... కుమార్తె కోసం గాలిస్తున్నారు. ఉదయం చెరువు వద్ద మహిళను గుర్తించి స్థానికులు ఆరాతీయగా.. విషయం వెలుగు చూసింది. రాత్రి కుమారుడు, కుమార్తెను చెరువులోకి నెట్టినట్లు తెలిపింది. మహిళను సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/ysr-kadapa/rape-accused-sucide-in-kadapa/ap20200614105716179