ఉద్యోగాల పేరుతో యువతుల నగ్న చిత్రాల సేకరణ
యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని... నగ్న చిత్రాలు సేకరిస్తున్న వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన క్లెమెంట్ రాజ్ 16 రాష్ట్రాలకు చెందిన యువతులను క్వికర్ డాట్ కామ్‌లో ఉద్యోగాల పేరిట మోసం చేశాడు.
ఉద్యోగాల పేరుతో యువతుల నగ్న చిత్రాలు సేకరిస్తున్న వ్యక్తిని తెలంగాణలోని... మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన క్లెమెంట్ రాజ్ ఉద్యోగాల కోసం సామాజిక మాధ్యమాల్లో ఉంచే మహిళల చరవాణి నంబర్లను సేకరించేవాడు. అనంతరం వారిని ఫోన్లో సంప్రదించి రాడిసన్ హోటల్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. వారితో సాన్నిహిత్యం పెంచుకుని నగ్న చిత్రాలు పంపాలని వేధించాడు. ఇలా 16 రాష్ట్రాలకు చెందిన యువతులను క్వికర్ డాట్ కామ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. క్లెమెంట్రాజ్ తమిళనాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.