తెలంగాణ సైబర్‌క్రైం పోలీసుల ఎదుట.. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ విచారణకు హాజరయ్యారు. ఆయనను పోలీసులు దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రవిప్రకాశ్.. తనను అన్యాయంగా మూడు కేసుల్లో ఇరికించినట్లు ఆరోపించారు. మాఫియా శక్తులు కావాలనే తనపై కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికి రవిప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌కు నోటీసులిచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మాఫియాపై పోరాడుతున్నందుకే.. నాపై కేసులు!
ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించి.. బుధవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు.
raviprakash