నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని కడప జిల్లా బద్వేలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి నాలుగున్నర లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను, టాటా ఏస్ వాహనం, రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా అక్రమ రవాణా.. నిందితుడి అరెస్ట్ - కడప నేర వార్తలు
నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని కడప జిల్లా బద్వేలులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నాలుగున్నర లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాలో గుట్కా అక్రమ రవాణా
బద్వేల్ పట్టణంలోని సురేంద్రనగర్‌కు చెందిన చంద్రశేఖర్ నాయుడు నెల్లూరు జిల్లా చిలకలమర్రికి గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా... బద్వేలు పట్టణంలో మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐలు రమేష్‌బాబు, ఎస్సై సురేష్‌రెడ్డి నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో తప్పించుకున్న నలుగురిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు.
ఇవీ చదవండి:అశ్లీల వెబ్‌సైట్‌తో విటులకు వల...3వేల మందికి టోపీ..!