ఈనెల 10వ తేదీ నున్న బైపాస్‌లో గజకంటి మహేష్ అనే వ్యక్తిని దుండగులు తుపాకితో కాల్చి హత్య చేశారు. సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా .. ఎన్నో ప్రశ్నలు అధికారులను వేధిస్తున్నాయి. నిందితులుగా భావిస్తున్న అనుమానితుల పాదముద్రలు, ఘటన స్థలంలో గుర్తించిన వాటితో పోల్చి చూస్తున్నట్టు తెలిసింది.
ముస్తాబాద్ వెళ్లే రోడ్డులో కారుని వదిలినప్పుడు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల్లో నిందితుల చిత్రాలు స్పష్టంగా లేవు. దీంతో ఆ పోలికలతో ఉన్నవారిని ఇతర సీసీ కెమెరాల్లో ఎక్కడైనా ఆధారాలు లభిస్తాయని పోలీసులు పరిశీలించారు. అయితే రామవరప్పాడు సెంటర్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్య జరిగిన విధానానికి, అతని జీవనశైలికి , అతని కాంటాక్ట్‌లకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో నిందితుల గుర్తింపు సంక్లిష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.