ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​ - కర్నూలు జిల్లా నేర వార్తలు

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురుని అరెస్ట్​ చేసి వారి నుంచి సుమారు రూ. 12 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలపారు.

Interstate gang arrested for burglary at temples at kurnool  district
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​

By

Published : Oct 17, 2020, 4:09 PM IST

ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దేవుడి ఆభరణాలు, విగ్రహాలు, హుండీలో సొమ్మును దొంగలిస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో... 23 కేసుల్లో వీళ్లు నిందితులుగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.

ఆలయాల్లో చోరీ చేసిన ఆభరణాలు

నిందితుల నుంచి 164 గ్రాముల బంగారు, 15 కిలోల 360 గ్రాముల వెండి ఆభరణాలు, 23 వేల 780 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీటి విలువ సుమారుగా రూ. 12 లక్షల 30 వేల 780 ఉంటుందన్నారు. నిందితుల్లో ఒకరు ఎరుకలి నల్లబోతుల నాగప్ప గతంలో పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details