అనంతపురం జిల్లా తనకల్లు మండలం సీజీ ప్రాజెక్టు సమీపంలో ఆదివారం రాత్రి బొలెరో వాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో చంద్రిక(14) మృతిచెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. మృతురాలు, గాయపడిన వారంతా ఒకే కుటుంబసభ్యులు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నివాసముండే కుమార్ నాయక్ బంధువులతో కలసి దీపావళి పండుగను జరుపుకునేందుకు తనకల్లు మండలానికి వచ్చారు. నడిమి తండాలో బంధువులతో కలిసి కుమార్ నాయక్ కుటుంబం పండగ జరుపుకుంది. అక్కడి నుంచి మొగలిచెట్ల తండాకు ఆటోలో బయలుదేరారు. సీజీ ప్రాజెక్టు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రిక అక్కడికక్కడే మృతిచెందగా బాలిక తండ్రి కుమార్‌నాయక్, సోదరుడు కిశోర్‌నాయక్, పిన్ని మునీశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను 108వాహనంలో కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం వైద్యశాలకు తరలించారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి... ముగ్గురికి తీవ్ర గాయాలు - బొలెరో వాహనం ఆటోను ఢీకొన్న ప్రమాదంలో బాలిక మృతి
బొలెరో వాహనం ఆటోను ఢీకొన్న ప్రమాదంలో బాలిక మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం సీజీ ప్రాజెక్టు వద్ద జరిగింది.
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి