గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం.. ముగ్గురు మృతి - అనంతపురం గార్లదిన్నెలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి న్యూస్
14:50 December 24
మరొకరి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద సబ్‌స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం నేషనల్ హైవే లోని విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉండగా... అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు బలంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...