తెలంగాణలో యువతి హత్య కేసును ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారైనట్టు గుర్తించారు. నలుగురు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత యువతిని హత్య చేసినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధరించారు. నలుగురిలో ఇద్దరిని మక్తల్‌కు చెందిన మహ్మద్ పాషా, మహబూబ్‌గా గుర్తించారు. టోల్‌ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
గురువారం తెల్లవారుఝామున 3 - 4 గంటల ప్రాంతంలో హత్య చేసి ఉంటారని పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు తేల్చారు. శరీరం గంట పాటు తగలబడినట్లు భావిస్తున్నారు. శరీరం పూర్తిగా తగలబడటం వల్ల పోస్టుమార్టం క్లిష్టంగా మారింది. మెడను చున్నితో బిగించి హత్య చేసి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. తలపైనా గాయాన్ని గుర్తించారు.