సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సికింద్రాబాద్ కోర్టు.. కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించింది. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. మూడు రోజుల పాటు విచారించేందుకు అనుమతిచ్చింది.కోర్టు ఆదేశాలతో అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు.. ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ఏ-1గా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఏ-2 ఏవీ సుబ్బారెడ్డికి నోటీసులిచ్చారు. ఏ-3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నారు. హఫీజ్‌పేట భూములకు సంబంధించిన వివాదంలో ప్రవీణ్‌రావ్ సోదరులను కిడ్నాప్‌నకు గురవగా.. దానివెనక ఉన్నది అఖిలప్రియ అని పోలీసులు నిర్ధరించారు. ఆమెను ప్రశ్నించి ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు.