విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయడంతోపాటు ఏడున్నర లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 20 ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్ బాక్సు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వి.హర్షవర్దనరాజు తెలిపారు.
పెనమలూరు పోలీసుస్టేషను పరిధిలోని మురళీనగర్‌లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు జరిపామన్నారు. క్రికెట్ మజా-11 అనే యాప్ ఉపయోగించి ఇవాళ జరుగుతున్న దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైటరైడర్స్ ఐపీఎల్2020 మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహించారని చెప్పారు. అరెస్టు అయిన వారిలో విజయవాడ మెగల్రాజపురానికి చెందిన వీరపనేని కల్యాణ్‌చక్రవర్తిపై గతంలోనూ కేసు నమోదైందన్నారు. పాత నేరస్థులపై గట్టి నిఘా ఉంచామన్నారు.