ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాయవాదికి టోకరా వేసిన బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

By

Published : Oct 28, 2020, 4:23 AM IST

విజయవాడలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్​గా పనిచేస్తున్న వ్యక్తిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాదికి చెందిన ఆధారాలతో బ్యాంకు ఖాతా తెరిచి అక్రమ లావాదేవీలకు పాల్పడటంతో బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెనాలి పోలీసులు పేర్కొన్నారు.

న్యాయవాదిని టోకరా కొట్టించిన బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
న్యాయవాదిని టోకరా కొట్టించిన బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

లావాదేవీల కోసం అడ్డదారి తొక్కిన బ్యాంకు మేనేజర్​ను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్​గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ తెనాలికి చెందిన కోటేశ్వరరావు అనే న్యాయవాది పేరిట బ్యాంకు ఖాతా తెరిచాడు. న్యాయవాది వద్ద దుర్గా ప్రసాద్ సోదరుడు కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు.

సోదరుడి సాయంతో..

సోదరుడి సాయంతో న్యాయవాది ఆధార్ నంబర్ సేకరించి బ్యాంకు ఖాతా తెరిచాడు. అందులో తన ఫోన్ నెంబర్లను పొందుపరిచాడు. తమ బ్యాంకులో ఖాతా తెరిచినందుకు ధన్యవాదాలు అంటూ బ్యాంకు నుంచి కోటేశ్వరరావు చిరునామాకు లేఖ వచ్చింది.

లేఖ రావడంతో..​

ఆధార్ కార్డులో చిరునామా మేరకు లేఖ నేరుగా కోటేశ్వరరావుకు రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. తనకు తెలియకుండానే ఖాతా తెరవటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు విచారణ జరిపించారు. బ్యాంక్ ఖాతాలో సుమారు రూ.19 లక్షల రూపాయలకుపైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

అక్రమ లావాదేవీల కోసమే..

అక్రమ లావాదేవీల కోసమే దుర్గాప్రసాద్ ఇలా చేసినట్లు తేల్చారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్​ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్లు తెనాలి పోలీసులు స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసిన వారిని కూడా విచారించనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : ప్రొద్దుటూరులో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details