ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ముగిసిన అఖిలప్రియ కస్టడీ... చంచల్‌గూడ జైలుకు తరలింపు

తెలంగాణలో.. కిడ్నాప్ కేసుకు సంబంధించి.. 3 రోజుల విచారణలో రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ స్టేట్‌మెంట్​ను ఆ రాష్ట్ర పోలీసులు రికార్డ్ చేశారు. భూ వివాదానికి సంబంధించి కీలక వివరాలు తెలుసుకున్నారు. అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా... మొదట తనకు తెలియదని అఖిలప్రియ దాటవేసినట్టు తెలుస్తోంది. పోలీసులు చూపించిన ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు అంగీకరించినట్టు సమాచారం. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ముగిసిన అఖిలప్రియ కస్టడీ
ముగిసిన అఖిలప్రియ కస్టడీ

By

Published : Jan 14, 2021, 4:04 PM IST

హైదరాబాద్​లోని బోయిన్​పల్లిలో... ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు.. రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ నుంచి తెలంగాణ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు.... భూవివాదానికి సంబంధించి పలు వివరాలు తెలుసుకున్నారు. వివాదాస్పద భూమిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా... ప్రవీణ్ రావు సోదరుల నుంచి స్పందన లేని కారణంగానే.. అపహరణకు పాల్పడినట్లు పోలీసుల వద్ద అఖిలప్రియ తెలిపినట్లు సమాచారం.

వాళ్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు!

అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా... మొదట తనకు తెలియదని దాటవేసిన అఖిలప్రియ... పోలీసులు చూపించిన ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకున్నట్లు సమాచారం. భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా బోయిన్​పల్లి వెళ్లి అపహరణను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. వీళ్లకోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

అలా వచ్చింది..

తెలంగాణ రాష్ట్రం హఫీజ్​పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమిని ఆయన బినామీ ఏవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించేవారు. 2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. న్యాయవాది కృష్ణారావు మరణంతో... ఆయన కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ సుబ్బారెడ్డి... ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకొని బయటికి వెళ్లిపోయాడు.

వాటా నిరాకరించడంతో..

ఈ విషయం అఖిలప్రియకు తెలియడంతో కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని... వాటా ఇవ్వాల్సిందిగా కోరారు. నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అఖిలప్రియను... వెస్ట్ మారేడ్‌పల్లిలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ వేశారు. న్యాయస్థానం ఎల్లుండి విచారించనుంది.

ఇదీ చదవండి:

కరోనా పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details