తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వీటిపై తీర్పును ఏసీబీ న్యాయస్థానం నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. ఓటుకు నోటుకు కేసులో తమ ప్రమేయం లేకపోయినప్పటికీ.. ఏసీబీ అధికారులు ఇరికించారని సండ్ర, ఉదయ్ సింహా వాదించారు.
ఓటుకు నోటు కేసులో ముగిసిన వాదనలు - హైదరాబాద్ వార్తలు
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పును తెలంగాణ ఏసీబీ న్యాయస్థానం నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది.
acb-court
కేసు నుంచి తమను తొలగించాలని కోర్టును కోరారు. సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు వాదించారు. డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసి.. అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నవంబరు 2కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ