ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2019, 6:29 PM IST

ETV Bharat / jagte-raho

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో.. ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

accident

రెండు బైకులు ఢీ.. ఒక వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగాం గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. సారవకోట మండలం నవతల గ్రామానికి చెందిన జన్ని చిన్న అప్పన్న అనే వ్యక్తి.. ద్విచక్రవాహనం నుంచి పడిపోగా.. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చిన్న అప్పన్న చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.

ABOUT THE AUTHOR

...view details