తెలంగాణ ఆర్టీసీ బస్సుపై కొందరు యువకులు కావాలని దాడి చేశారని నిర్ధరించిన పోలీసులు.... నలుగురిని అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించి... నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన నలుగురిలో ఇద్దరిపై గతంలోనూ కేసులు ఉన్నట్టు తెలిపారు. షేక్ షాజిద్, దుర్గారాజేశ్‌పై వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నట్టు వెల్లడించారు. వీళ్లంతా కలిసి బస్సుడ్రైవర్ జానయ్యపై ఉద్దేశపూర్వకంగాదాడి చేశారని గుర్తించారు. ఉద్దేశపూర్వకంగాకండక్టర్ వద్ద నగదుఎత్తికెళ్లినట్లు తేల్చారు.
ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో నలుగురి అరెస్టు - telangana rtc
రెండు రోజు క్రితం తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో మరో పురగతి సాధించారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని నలుగురిని అరెస్టు చేశారు.
ఆర్టీసీ బస్సుపై యువకుల దాడి
ఏం జరిగిందంటే
నార్కెట్‌పల్లికి చెందిన బస్సును విజయవాడలోని భవానీపురం వద్దకు రాగానే ఈ యువకులంతా నిలిపివేశారు. ద్విచక్రవాహనాలను రోడ్డుకు అడ్డుగా నిలిపివేసి హంగామా సృష్టించారు. తమ వాహనాలకు దారివ్వకుండా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కిలోమీటరు మేర వెంబడించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసి టిమ్, చేతిలో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు.
Last Updated : Jun 4, 2019, 10:47 AM IST