ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / headlines

జనసేన అభ్యర్థులు వీరే! - rajamahendravaram

ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు తామూ సిద్ధమైనట్టు జనసేన అధ్యక్షుడు సంకేతాలు ఇచ్చారు. రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తానన్న పవన్... మొదటగా ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ రెండు స్థానాలు తూర్పు గోదావరి జిల్లాలోవి కావడం విశేషం.

జనసేన ఎంపీ అభ్యర్థులు

By

Published : Mar 11, 2019, 5:39 PM IST

జనసేన అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల నగారా మోగాక అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంలో తలమునకలవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం 32 మంది అసెంబ్లీ, 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి విడత జాబితా సిద్ధం చేశారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన పవన్ కల్యాణ్....ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఓఎన్జీసీలో పనిచేసిన విశ్రాంత అధికారి డీఎంఆర్ శేఖర్ పేరును మొదటిగా ప్రకటించారు. రాజమహేంద్రవరం స్థానానికి భాజపా తరపున 2014 ఎన్నికల్లో గెలిచి ఇటీవల జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణను ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని జనసేనాని విశ్వాసం వ్యక్తం చేశారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.

పొత్తులపై మంతనాలు

పవన్ కళ్యాణ్​తో వామపక్షాలు చర్చలకు సిద్ధమయ్యాయి. ఎన్నికల పొత్తులపై రామకృష్ణ, మధుతో పవన్​ఈ రోజు మంతనాలు చేయనున్నారు. ఈ భేటీలోనే సీట్ల సర్దుబాటుపై నిర్ణయానికి రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details