సీబీఐ సీనియర్ అధికారులు అనీశ్ ప్రసాద్, అభయ్సింగ్ల పదవీకాలం ఉండగానే బదిలీ చేసింది అంతర్గత వ్యవహారాల శాఖ. 2003 బ్యాచ్ త్రిపుర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనీశ్ ప్రసాద్‌ను తిరిగి రాష్ట్ర సర్వీస్‌కు పంపించింది. 2003 మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అభయ్సింగ్ను రాంచీకి బదిలీ చేసింది.
ప్రస్తుతం సీబీఐ పాలనా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అనీశ్ ప్రసాద్ సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్‌వర్మ, రాకేశ్ అస్థానా వివాదం నడిచేటప్పుడు కీలకమైన సీబీఐ నిఘా విభాగంలో పనిచేశారు.