Young Man Died Taking With The Selfie : సెల్ఫీ.. ఈ పేరు వింటేనే యువతకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. రకరకాల భంగిమలతో.. ఫొటోలకు పోజులు ఇచ్చి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. వాటికి వచ్చే లైకులు కామెంట్లతో అదో రకమైన తృప్తి పొందుతుంటారు. ఇందుకోసం చాలామంది ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇప్పటిదాకా ఎంతోమంది సెల్ఫీ తీసుకోబోయి.. ఫొటోలకు పర్మనెంట్‌గా దండలు వేయించుకున్నారు. ఆ లిస్టులో తాజాగా మరో వ్యక్తి చేరిపోయాడు.
పామును మెడలో వేసుకుని శివుడిలా పోజు ఇవ్వబోయాడు.. - ఏపీ తాజా వార్తలు
12:43 January 25
కందుకూరులో పామును మెడలో వేసుకుని ఫొటో తీసుకునే యత్నం
నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఏకంగా పాముతోనే పరాచకాలు ఆడాడు. పామును మెడలో వేసుకొని శివుడిలా పోజులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. తాళ్లూరు చెందిన మణికంఠ రెడ్డి అనే యువకుడు కందుకూరులో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు. అప్పుడే అక్కడకు పాములు పట్టే వ్యక్తి వచ్చి కోరలు తీసిన పాము అని చెప్పడంతో అత్యుత్సాహం చెందిన అతను.. పాముతో సెల్ఫీ దిగడానికి సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో పామును మెడలో వేసుకుని కొన్ని ఫొటోలకు పోజులు ఇచ్చాడు. అయితే మెళ్లో ఉన్న పాము.. కింద పడిపోతుండగా మళ్లీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాటు వేసింది. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
"రాత్రి 9 గంటల సమయంలో మణికంఠ అనే అబ్బాయి.. పామును మెడలో వేసుకుని సెల్ఫీ దిగాలనే కోరికతో ఫొటో దిగాడు. పాము కింద పడుతున్న సమయంలో పట్టుకోవడంతో కాటు వేసింది. వెంటనే మేము ఆసుపత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి విషమించడంతో పెద్దాసుపత్రికి తీసుకువెళ్తుండగా.. రాత్రి 11 గంటల సమయంలో చనిపోయాడు"-స్థానికుడు
ఇవీ చదవండి: