ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

YCP Leaders Attacks: సామాజిక కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి.. - సామాజిక కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి

YCP Leaders Attacks:గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో సామాజిక కార్యకర్త యన్నం రమణారెడ్డిపై కొందరు వైకాపా శ్రేణులు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఘటనలో యన్నం రమణారెడ్డి తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం బంధువులు 108లో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామంలో కుళాయిలు, సీసీ రోడ్లలో జరిగిన కోట్ల రూపాయల పనులలో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని, అధికారులు విచారిస్తే అవన్నీ బయటకు వస్తాయనే తనపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

YCP leaders attacks social activist
సామాజిక కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి

By

Published : Mar 16, 2022, 8:46 PM IST

Updated : Mar 16, 2022, 10:22 PM IST

YCP Leaders Attacks: నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో సామాజిక కార్యకర్త యన్నం రమణారెడ్డిపై కొందరు వైకాపా శ్రేణులు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఇటీవల గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరానని యన్నం రమణారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో విచారణ కోసం ప్రభుత్వ అధికారులు గ్రామ సచివాలయం వద్దకు రమ్మన్నారని, అక్కడికి వెళ్లిన తనపై వైకాపా నాయకులు కొందరు దాడి చేసి పత్రాలు లాక్కెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన వారిలో సర్పంచ్ మస్తాన్ వలి, గొంటు విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గొంటు శ్రీనివాసరెడ్డి, చేరెడ్డి వెంకట్ రామిరెడ్డి, అంకిరెడ్డి లు ఉన్నారని బాధితుడు రమణారెడ్డి వెల్లడించారు. సచివాలయం వద్ద ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే తనపై దాడి జరిగిందని బాధితుడు వ్యాఖ్యానించారు. గ్రామంలో కుళాయిలు, సీసీ రోడ్లలో జరిగిన కోట్ల రూపాయల పనులలో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని అధికారులు విచారిస్తే అవన్నీ బయటకు వస్తాయనే తనపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి
Last Updated : Mar 16, 2022, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details