MURDER: బాపట్లజిల్లా చీరాల మండలం దేవాంగపురిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన రోడ్డు మీద వదిలేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య జరిగిందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతురాలిని సలోమిగా గుర్తించారు. సునీల్ కుమార్ అనే వ్యక్తితో ఆమె పదేళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. హత్యకు సంబంధించి సునీల్‌కుమార్‌పై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. సునీల్ కుమార్ పరారీలో ఉన్నాడని చీరాల ఒకటో పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
MURDER: బాపట్ల జిల్లాలో.. మహిళ దారుణ హత్య..! - బాపట్ల జిల్లా తాజా వార్తలు
MURDER: ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన రోడ్డు మీద వదిలేసిన ఘటన బాపట్ల జిల్లాలో కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
బాపట్ల జిల్లాలో.. మహిళ దారుణ హత్య