భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య.. కారణం అదేనా? - భర్తను చంపిన భార్య
14:46 April 11
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం
Murder: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం జరిగింది. రోజూ మద్యం సేవించి ఇబ్బంది పెడుతున్న భర్త అరాచకాలను తట్టుకోలేక.. రుక్మిణి అనే మహిళ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తలుపులు తెరిచి చూసేలోపు కృష్ణారెడ్డి పూర్తిగా కాలిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సంతనూతలపాడు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:"తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే... బీసీల అభివృద్ధి ఇమిడి ఉంది"