గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వాలంటీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం చిత్తన్నగారిపల్లి వద్ద జరిగింది. పూతలపట్టు మండలం పేట అగ్రహారానికి చెందిన భానుప్రకాశ్ గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం కాణిపాకంలో తన వివాహ నిశ్చితార్థం కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. శుభకార్యం జరగాల్సిన రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి అంధుడు కావడం.. కుమారుడి మీదే ఆధారపడిన కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిమిత్తం మృతదేహాన్నిచిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: