ప్రకాశం జిల్లా చీరాల విజిల్పేటకు చెందిన దేవరకొండ గోపి, కుంభ ఆంజనేయులు, దేవరకొండ అశోక్ అనే ముగ్గురు కారంచేడు రోడ్డులో మోపెడ్‌పై వెళ్తున్నారు. చీరాల ఆర్చి సమీపంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం వీళ్ల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చీరాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ దేవరకొండ గోపి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
చీరాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు - చీరాలలో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా చీరాల-కారంచేడు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మారొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1వ పట్టణ పోలీసులు తెలిపారు.
చీరాలలో రోడ్డు ప్రమాదం
విషయం తెలుసుకున్న 1వ పట్టణ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను చీరాల నియోజకవర్గ తెదేపా నేత యడం బాలాజీ పరామర్శించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండ:వరి పొట్టు ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి