ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తెలంగాణ: నదిలో మునిగి నలుగురు దుర్మరణం - నదీ దాటుతుండగా నలుగురు మృతి

నదిలో మునిగి నలుగురు మృతి చెందిన ఘటన తెలంగాణ కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ఘటన పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

tragedy
నదిలో మునిగి నలుగురు దుర్మరణం

By

Published : Jun 26, 2021, 6:52 PM IST

తెలంగాణ కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీర్కూర్ శివారులోని చౌడమ్మకయ్యలో నదిలో మునిగి నలుగురు మృతి చెందారు. దర్గా దర్శనం కోసం తెల్లవారుజామున నలుగురు బీర్కూర్​ నుంచి బిచ్కుంద మండలం షెట్లూర్​కు వెళ్లేందుకు మంజీరా నది వద్దకు వచ్చారు.

నలుగురు నది దాటుతుండగా మునిగిపోయారు. మృతులు అంజవ్వ, సోని, గంగోత్రి, ప్రశాంత్​గా పోలీసులు గుర్తించారు. నలుగురు మృతదేహాలు స్థానికులు వెలికితీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details