Car Bolta in Marchala: తెలంగాణ రాష్ట్రంనాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన అరవింద్, వర్ధిపట్లకు చెందిన శిరీష, ఖమ్మంకు చెందిన కిరణ్మయి, మిర్యాలగూడ గూడురుకు చెందిన రేణుక హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతూ.. హాస్టల్‌లో ఉంటున్నారు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దుండలోని ఓ వివాహ విందుకు హాజరయ్యారు. అనంతరం, రాత్రి హైదరాబాద్‌కు తిరిగివస్తూ దారితప్పారు.
Car Accident: కారు బోల్తా.. ముగ్గురు విద్యార్థులు మృతి - Car Bolta in Marchala
Car Bolta in Marchala : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా మార్చాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
accident
ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న వాహనం.. మార్చాల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అరవింద్, శిరీష, కిరణ్మయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి రేణుక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :