ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు.. రూ.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

By

Published : Mar 6, 2022, 8:56 PM IST

thief arrest: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

thief arrest in guntur district
గుంటూరు జిల్లాలో దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసుులు

theft case : గుంటూరు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి, 86 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో గురజాలలో సెల్‌ఫోన్ దొంగతనం కేసులో దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా ఈ భారీ చోరీ బయటపడింది.

గుంటూరుతో పాటు విజయనగరం, అచ్చంపేట, గురజాలలో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా దొంగను పట్టుకున్న పోలీసులకు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ నగదు పురస్కారాలను అందజేశారు.

ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ ఢీ...ఇద్దరు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details