Meeseva Employee Murder Ramagundam : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు చేతులు కనిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కాజిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌గా గుర్తించారు.
Ramagundam Murder today: రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు.. ఎవరివి? - రామగుండం రాజీవ్ రహదారిపై మొండం లేని తల
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కుందనపల్లిలో జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు దర్శనమిచ్చాయి. అది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు.
Ramagundam Murder today 2021 : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపల్లి గ్రామానికి చెందిన కాంపెల్లి శంకర్ రెండు రోజుల క్రితం అదృశ్యమై మల్యాల పల్లి రాజీవ్ రహదారి పక్కన దారుణ హత్యకు గురయ్యాడు. శంకర్ తల, చేతులు వేరువేరుగా పడి ఉండగా మొండెం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. సంఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మొండెం కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన ఎలా జరిగింది... దారుణ హత్యకు పాల్పడిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఉత్కంఠకు దారితీసింది..
ఇదీ చదవండి :