ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

husband killed wife: భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త.. ఆపై... - భార్య గొంతు కోసిన భర్త

husband killed wife: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అతి కిరాతంగా హత్య చేశాడో భర్త. అనంతరం పోలీసులు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

murder
murder

By

Published : Dec 10, 2021, 10:37 AM IST

Rajendranagar Murder Case: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​లో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యను.. భర్త కిరాతకంగా హత్య చేశాడు. రాజేంద్రనగర్​లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ భార్య సమ్రిన్​తో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఫర్వేజ్-సమ్రిన్​లకు 14 ఏళ్ల క్రితం వివాహం కాగా.. భర్త వేధింపులు తాళలేక సమ్రిన్ విడాకులు తీసుకుంది. భార్యకు నచ్చజెప్పిన ఫర్వేజ్​.. గతేడాది ఆమెను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

అప్పటినుంచి ఫర్వేజ్​కు భార్యపై అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తరచూ గొడవలు జరిగేవి. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్లిన అతను.. భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అప్పటికి కసితీరక సమ్రిన్ తలను శరీరం నుంచి వేరు చేశాడు. అనంతరం తలను తీసుకుని పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లాడు.

గంజాయి మత్తులో..?

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో ఫర్వేజ్ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులో అతను దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపించారు.

ఇదీ చూడండి:

mother killed baby: రావెలలో దారుణం..రెండు రోజుల పసిపాపను చంపిన తల్లి

ABOUT THE AUTHOR

...view details