Road Accident: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలంలోని వంగూరు సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్ధలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. చెట్టుకి వాహనం బలంగా డీకొనడంతో.. మహారాష్ట్రకు చెందిన తేజస్(37) అక్కడికక్కడే మృతి చెందారు.. ఏర్పేడు ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని రోడ్డు ప్రమాదం జరిగింది.. ఇద్దరు యువకులు బైక్పై అతి వేగంతో డివైడర్‌ను ఢీకొని అక్కడిక్కడే మృత్యువాత చెందారు. మృతులు విజయవాడలోని ఇస్లాంపేటకు చెందినవారని పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు తీవ్రగాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు మదనపల్లె ప్రశాంత్ నగర్ వాసి శంకర్ రెడ్డి (53) అని పోలీసులు వెల్లడించారు.