SUICIDE: ఆన్‌లైన్ మోసానికి గురై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో చోటుచేసుకుంది. ఎస్సై చినబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మూడు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తోంది. సంస్థ కార్యాలయంలో నేరుగా విధులు నిర్వర్తించేందుకు ఆదివారం తెల్లవారుజామున బంధువులతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు స్కూటీపై బయటకు వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తాను చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లి ఫోన్‌కు సందేశం పంపింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన చిల్లకల్లు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Cyber Crime: ఆన్‌లైన్ మోసానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలి - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు
SUICIDE: చిల్లకల్లులోని ఓ చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ తర్వాత ఉద్యోగంలో చేరేందుకు ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత.. రాత్రి 8 గంటల సమయంలో చనిపోతున్నట్లు తన తల్లిదండ్రులకు వాట్సప్‌లో సందేశం పంపింది.
శనివారం రాత్రి గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మృతదేహం లభించింది. వివరాలు సేకరించిన పోలీసులు.. ఆన్‌లైన్ మోసమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అపరిచిత వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆమెకు పరిచయమై రూ.1.2 లక్షలు చెల్లిస్తే.. రూ.7 లక్షలు తిరిగి వస్తాయని ఆశ చూపాడు. ఆమె తనవద్ద డబ్బుల్లేవని చెప్పింది. ఆ వ్యక్తే రూ.50వేలు ఆమె ఖాతాకు పంపాడు. మిగిలిన మొత్తం కలిపి తాను చెప్పిన ఖాతాకు పంపమన్నాడు. దశల వారీగా మరో రూ.1.3 లక్షలు కట్టించాడు. రెండు రోజులుగా ఆ వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్వేత... ఆ కారణంగానే ఆత్మహత్యకు సిద్ధపడి ఉంటుందని, మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని ఎస్సై చెప్పారు.
ఇవీ చదవండి: