తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్(Disha Encounter Case)పై సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) విచారణ వేగవంతం చేసింది. నేటి నుంచి మలివిడత విచారణ ప్రారంభించనుంది. ఈనెల 25వరకు ఇది కొనసాగనుంది. ఇప్పటికే మూడు విడతలుగా కమిషన్(Sirpurkar Commission) విచారణ చేపట్టింది.
తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో పాటు సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని కమిషన్(Sirpurkar Commission) విచారించింది. సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన కమిషన్.. ఆయనపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించింది. అఫిడవిట్లోని పలు అంశాలను ప్రస్తావించగా.. కొన్నింటికి సురేందర్ రెడ్డి సమాధానం చెప్పలేదు.