road accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కేసర బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ మాచవరం మారుతి నగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తిరుపతమ్మ అమ్మ వారి దర్శనానికి కారులో వెళ్లి తిరిగి విజయవాడ వెళుతుండగా కేసరి వంతెన సమీపంలో అదపు తప్పిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ కారు డివైడర్ ను దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్న బైకర్పై పడింది. ఈ సంఘటనలో కారులో ఉన్న ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై ఉన్న వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పి.. పల్టీ కొట్టి.. డివైడర్ దాటి.. బైకర్పై పడిన కారు.. ఒకరు మృతి
road accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. . విజయవాడకు చెందిన ఓ కుటుంబం తిరుపతమ్మ అమ్మ వారి దర్శనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా, వారి కారు వేగాన్ని అదుపు చేసుకోలేక పల్టీలు కొట్టి, డివైడర్ అవతల ప్రయాణిస్తున్న బైక్పై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
road accident