ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Hulchal with Gun: తుపాకీతో రౌడీషీటర్‌ హల్‌చల్‌.. గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు - rowdy sheeter gun firing

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బర్త్‌ డే వేడుకలు శృతిమించి పోతున్నాయి. బర్త్‌ డే వేడుకల్లో భాగంగా రౌడీషీటర్‌ ఆరిఫ్.. తుపాకీతో హల్​చల్ చేశాడు. గాలిలో కాల్పులు జరిపిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.

తుపాకీతో రౌడీషీటర్‌ హల్‌చల్‌
తుపాకీతో రౌడీషీటర్‌ హల్‌చల్‌

By

Published : Aug 12, 2021, 7:18 PM IST

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. పట్టణానికి చెందిన ఆరిఫ్​ అనే రౌడీషీటర్​.. పుట్టిన రోజు వేడుకలను అనుచరులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆరిఫ్​... తుపాకీతో హల్​చల్​ చేశాడు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. చోరీలు, దారిదోపిడీ, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆరిఫ్.. పీడీ యాక్టు కింద అరెస్టు అయ్యి ఇటీవలే విడుదలయ్యాడు. ఓ ఫామ్​హౌస్​లో ఆరిఫ్​ బర్త్​డే వేడుకలు చేసుకున్నాడు. పెద్దఎత్తున అతడి అనుచరులు పాల్గొన్నారు. వేడుకల్లో కొందరు అనుచరులు తల్వార్లు, పిస్తోళ్లతో కనిపించారు.

ఫామ్​హౌస్​కి కారు ముందు భాగంలో కూర్చొని అభివాదం చేస్తూ ఆరిఫ్​ వచ్చాడు. అనుచరులందరికీ అభివాదం చేస్తూ.. వస్తోన్న ఆరిఫ్​కు గుంపులో నుంచి ఒకరు తుపాకీ అందించారు. దానితో అభివాదం చేస్తూనే... గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు చేశాడు ఆరిఫ్​. ఈ తతంగాన్నంతా పలువురు తమ చరవాణుల్లో వీడియో తీయగా... అది కాస్తా వైరల్​గా మారింది. ఈ వేడుకల్లో పలువురు రాజకీయ నేతలు కూడా పాల్గొన్నట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details