ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో ప్రమాదం.. ముగ్గురు మృతి

accident
తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో ప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : May 22, 2022, 8:09 AM IST

Updated : May 22, 2022, 9:32 AM IST

08:06 May 22

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ACCIDENT: వైస్సార్ జిల్లా మైలవరం మండలం కర్మలవారి పల్లె సమీపంలోని తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో.. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దండే వెంకటసుబ్బయ్య, చౌడం లక్ష్మీ మునమ్మ, వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్​తో పాటు ఓ బాలిక గాయపడింది. ఈ ఘటనలో మృతి చెందిన వెంకటసుబ్బమ్మ, లక్ష్మీమునమ్మ తల్లీకూతుళ్లు. వీరిద్దరూ జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన వారు కాగా.. వెంకటసుబ్బయ్య మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 22, 2022, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details