కడప జిల్లాలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మైనర్ బాలికపై.. యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్త కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం! చిన్నప్పుడే.. తండ్రి చనిపోయిన ఆమె.. ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటోంది. మైనర్ బాలిక ఇంటికి దగ్గరలోనే మేనత్త ఉంటోంది. అప్పుడప్పుడూ బాలిక వారింటికి వెళ్లేది.
బాలికపై మేనత్త కొడుకైన శివ కన్ను పడింది. ఈ నేపథ్యంలోనే.. ఇటీవలే వారింటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పలేకపోయింది.