Rape: రెండు సంవత్సరాల కొడుకు ముందే కన్నతల్లిపై అత్యాచారం జరిగిన దారుణ ఘటన గురజాల వట్టణంలోని రైల్వే స్టేషన్ నందు చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గుర్తుతెలియని మహిళపై ఇద్దరు వ్యక్తులు అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వేస్టేషన్లో తీవ్ర రక్తస్రావంతో పడివున్న మహిళను స్థానికులు చూసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ పక్కనే రెండేళ్ల బాబు ఉన్నాడని స్థానికులు తెలిపారు. మహిళ బాగా నీరసంగా ఉండడంతో ఎలాంటి వివరాలు చెప్పలేకపోతుందని వైద్యురాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం తనపై అత్యాచారం చేసినట్లు చెబుతోందని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
Rape: గురజాలలో దారుణం.. రెండేళ్ల కొడుకు ముందే తల్లిపై అత్యాచారం - పల్నాడు జిల్లా మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం
Rape: ఆమెది ఈ రాష్ట్రం కాదు.. ఈ భాషా కాదు.. కూలి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది..అక్కడినుంచి ఎటు వెళ్ళాలో తెలియక తన రెండు సంవత్సరాల కొడుకుతో.. దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషన్లోని హాల్ట్ భవనం వద్ద ఓంటరిగా నిద్రించింది. అదే ఆమె చేసిన తప్పు.. ఎందుకంటే ఆమెపై ఇద్దరు వ్యక్తులు అతికిరాతంగా అత్యాచారం చేశారు. ఇంతకీ ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందంటే?
న్యాయం చేయాలని డిమాండ్: ఈ ఘటనపై వామపక్షాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గురజాల మున్సిపల్ ఛైర్మన్ పోలు వీరారెడ్డి బాధిత మహిళను పరామర్శించారు. గురజాల మాజీ శాసన సభ్యులు యరవతినేని శ్రీనివాసరావు బాధిత మహిళను పరామర్శించారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: Baby Death: చిన్నారి మృతికి పోలీసులు కారణం కాదు: ఫక్కీరప్ప