ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Vanama Raghava Remand Report: వనమా రాఘవ రిమాండ్ రిపోర్టు.. 'మొత్తం 12కేసులు' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

Vanama Raghava Remand Report : కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలను ఆత్మహత్యకు ముందు రామకృష్ణ వీడియో రూపంలో చిత్రీకరించాడు. అంతేకాకుండా ఆ వీడియోకు సంబంధించిన వివరాలను మిత్రుడికి సందేశం రూపంలో పంపించాడు. ఈ విషయాన్ని రిమాండ్ నివేదికలో పోలీసులు పొందుపరిచారు. ఈ మేరకు వనమా రాఘవేంద్ర రిమాండ్ రిపోర్టును తెలంగాణ పోలీసులు న్యాయస్థానికి సమర్పించారు.

Vanama Raghava
Vanama Raghava

By

Published : Jan 12, 2022, 3:39 PM IST

Vanama Raghava Remand Report : 'సారీ బాస్.. నన్ను క్షమించు. నేను ఒక వీడియో చేసిపెట్టాను. నా కార్ డ్యాష్ బోర్డులో ఉంది. నా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూడు. ఫోన్ లాక్ 7474. ఆ వీడియో చూసి అందిరికీ పంపు. నా కారు తాళం బాత్ రూమ్ పైన ఉంది. నీకు మాత్రమే చెబుతున్నా ఓకే.' తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటనలో బాధితుడు నాగ రామకృష్ణ చివరి మాటలు ఇవీ. తన కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలు, కారకులపై సెల్ఫీ వీడియోల్లో పేర్కొన్న రామృకృష్ణ.. ఈ విషయం బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు తన మిత్రుడికి పూర్తి సమాచారం చేర వేసినట్లు రిమాండ్ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు వనమా రాఘవేంద్ర రిమాండ్ రిపోర్టును పోలీసులు న్యాయస్థానికి సమర్పించారు.

రాఘవ రిమాండ్ రిపోర్టు

Palvancha Family suicide case : తాను చనిపోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవేంద్రతోపాటు తన తల్లి సూర్యావతి, సోదరి మాధవిలే కారణమని బాధితుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. తొలుత పాల్వంచ పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో.. ఆ తర్వాత పాల్వంచ ఏఎస్పీ నేతృత్వంలో కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన రామకృష్ణ కూతురు సాయి సాహితి స్టేట్ మెంట్​ను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్​లో రామకృష్ణ బావమరిది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 302, 307, 306 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. రామకృష్ణ స్నేహితుడు ఫోన్​కు వచ్చిన ఆడియో సందేశం ఆధారంగా ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు.

బెదిరించినట్లు ఆధారాల సేకరణ

క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. తమకు లభించిన ఆధారాలతో కారు తాళం తెరిచి కీలకమైన అంశాలు గుర్తించినట్లు నివేదికలో పొందుపరిచారు. ఒక పేజీ ఆత్మహత్య లేఖ, మరో 7 పేజీలతో కూడిన అప్పు కాగితాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితోపాటు 34 నిమిషాల సెల్ఫీ వీడియో కలిగిన ఫోన్​ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవేంద్ర... బాధితుడిని బెదిరించినట్లు పూర్తి ఆధారాలు సేకరించామన్నారు. రామకృష్ణకు సంబంధించిన ఆస్తి వివాదం పరిష్కరించేందుకు డబ్బుతో పాటు ఆయన భార్యను పంపాలని ఆదేశించినట్లు రామకృష్ణ పేర్కొన్నట్లు కోర్టుకు నివేదించారు.

నివేదికలో కీలక విషయాలు

వనమా రాఘవేంద్రకు బెయిల్ లభిస్తే తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేసులో సాక్ష్యుల ప్రాణాలకు ప్రమాదం ఉందని రిమాండ్ నివేదికలో వివరాలు పోలీసులు పొందుపరిచారు. అంతేకాకుండా వనమా రాఘవేంద్రపై గతంలో ఉన్న అన్ని కేసుల వివరాలు న్యాయస్థానానికి సమర్పించారు. రాఘవేంద్రపై మొత్తం 12కేసులు ఉన్నట్లు కోర్టుకు నివేదించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల వివరాలు నివేదించారు. పాల్వంచ పట్టణంలో 5, కొత్తగూడెం మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో 3, పాల్వంచ గ్రామీణ పీఎస్​లో 2, లక్ష్మీదేవిపల్లిలో ఒక కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు.

కేసుల వివరాలు

పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 5/2006 కేసులో 143, 341, 427, 504, సెక్షన్ల కింద, క్రైమ్ నంబర్ 333/2017 కేసులో 143, 353, 341, 290, 427 కింద, క్రైమ్ నంబర్ 157/ 2020లో 188, 307 సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు తెలిపారు. క్రైమ్ నంబర్ 268/2021 లో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఇదే పోలీస్ స్టేషన్​లో క్రైమ్ నంబర్ 137/2013లో 1988, ఐపీసీ సెక్షన్ 214 కింద కేసు నమోదైనట్లు నివేదించారు. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్​లో మూడు కేసులు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. క్రైమ్ నంబర్ 137/2013లో 171E, ఐపీసీ 188 సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ నంబర్ 138/ 2013లో 336, 353, 171E, 188ఐపీసీ సెక్షన్ల కింద, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్​లో క్రైమ్ నంబర్ 113/2019లో 143, 447, 427, 506, సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు తెలిపారు. కొత్తగూడెం మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో మూడు కేసులు ఉన్నట్లు కోర్టుకు నివేదించారు. క్రైమ్ నంబర్ 1767/2018 లో ఐపీసీ 188 సెక్షన్ కింద, 172/2018లో ఐపీసీ 188 సెక్షన్ కింద, క్రైమ్ నంబర్ 169/2011లో 143, 188, ఐపీసీ 149 సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

తల్లీసోదరి అరెస్ట్

మరోవైపు నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఏ3, ఏ4గా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిలను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కొత్తగూడెంలోని 2వ అదనపు జ్యుడీషియల్ మొదటిశ్రేణి న్యాయమూర్తి ఎం.నీలిమ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరినీ ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.

ఇదీ చదవండి:Vanama Raghava Land Kabza: భూ బకాసురుడు.. బయటకొస్తున్న రాఘవ ఆగడాలు

ABOUT THE AUTHOR

...view details