ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

గోదావరిలో దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం..కాపాడిన పోలీసులు - mother and daughter suicide attempt

ఓ మహిళ.. తన 8ఏళ్ల కుమార్తె(చిన్నారి)తో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని గోదావరి నదికి వెళ్లింది. అయితే చిన్నారి ఇచ్చిన సమాచారంతో రావులపాలెం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాళ్లను కాపాడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కుటుంబ సమస్యలు తట్టుకోలేక చనిపోవాలనుకున్నట్లు పోలీసులకు తెలిపారు.

తల్లీకుతూరు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
తల్లీకుతూరు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

By

Published : Aug 7, 2021, 10:47 PM IST

కుటుంబ సమస్యల నేపథ్యంలో తన 8ఏళ్ల కుమార్తె(చిన్నారి)తో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన ఓ మహిళను పోలీసులు కాపాడారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సీఐ కృష్ణ వివరించారు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి చెందిన మాదాసు మంగాదేవి.. తన ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి స్థానికంగా నివాసముంటోంది. భర్త పట్టించుకోకపోవడం వల్ల కొన్నేళ్లుగా ఇబ్బందుల మధ్య జీవనం సాగిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆర్థిక, కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో చనిపోవాలని నిర్ణయించుకున్న ఆమె.. తన కుమార్తెను తీసుకొని రావులపాలెం సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లింది.

చిన్నారి సమాచారంతో...

ఈ క్రమంలో చిన్నారి.. మంగాదేవి బంధువులకు సమాచారం ఇచ్చింది. మంగాదేవి బందువుల సమాచారంతో ఎస్పీ రవీంథ్రనాథ్‌.. వెంటనే రావులపాలెం పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే వాళ్లు ఉన్న చోటుకు వెళ్లిన పోలీసులు.. ఆ ఇద్దరినీ అక్కడినుంచి పీఎస్​కు తీసుకెళ్లారు. అనంతరం సీఐ కృష్ణ.. మంగాదేవి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ విషయంలో చాకచక్యంగా వ్యవహరించి కాపాడిన రావులపాలెం పోలీసులను ఎస్పీ రవీంద్రనాథ్ అభినందించారు.

ఇదీ చదవండి..

murder case: స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

ABOUT THE AUTHOR

...view details