Telangana Realtors Murder Case:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారులపై కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వాళ్ల నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవటంతో ప్రత్యేక కేసుగా భావించి.. 48 గంటల పాటు నిర్విరామంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
మట్టారెడ్డిదే మొత్తం పథకం..
"రియల్టర్లపై కాల్పుల కేసులో మట్టారెడ్డి, మోహియుద్దీన్, భిక్షపతి, షమీం, రహీంను అరెస్టు చేశాం. నిందితుల నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ హత్యలో వాడిన తుపాకులు, మందు గుండు సామగ్రి కొనేందుకు నిందితులు బిహార్ వెళ్లారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా భావించి ఛేదించాం. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నాం. కాల్పుల ఘటనపై పథక రచన మొత్తం మట్టారెడ్డిదే. స్థిరాస్తి వ్యాపారులపై భిక్షపతి, మోహియుద్దీన్ కాల్పులు జరిపారు. తొలుత విచారణలో మట్టారెడ్డి మాకు సహకరించలేదు. గెస్ట్‌హౌస్‌లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. అన్ని ఆధారాలు చూపించాక మట్టారెడ్డి నేరం ఒప్పుకున్నాడు." - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఇవీ చూడండి:Realtors Murder Update: రియల్టర్లపై కాల్పుల ఘటనలో ముమ్మర దర్యాప్తు.. పలు కోణాల్లో విచారణ