ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SULABH: తెలంగాణలో 'సులభ్ కాంప్లెక్స్' దొంగ అరెస్ట్.. నగదు స్వాధీనం

Thief Stole Sulabh Complex in GHMC: తెలంగాణలోని సఫిల్‌గూడ చౌరస్తాలోని సులభ్‌ కాంప్లెక్స్‌ను రాత్రికి రాత్రి చోరీ చేసి.. తుక్కుగా మార్చి విక్రయించిన దొంగను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 45వేల రూపాయల నగదు, చోరీకి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Thief Stole Sulabh Complex in GHMC
తెలంగాణలో 'సులభ్ కాంప్లెక్స్' దొంగ అరెస్ట్

By

Published : Mar 22, 2022, 11:11 AM IST

Thief Stole Sulabh Complex in GHMC: తెలంగాణలోని మల్కాజ్​గిరి పీఎస్ పరిధిలో సఫిల్‌గూడ చౌరస్తాలోని స్వచ్ఛ టాయిలెట్ ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 45వేల నగదు, ఎత్తుకెళ్లడానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే...

సీఐ జగదీశ్వరరావు, మల్కాజిగిరి సర్కిల్‌ ఉప కమిషనర్‌ రాజు వివరాల ప్రకారం.. సఫిల్‌గూడ చౌరస్తాలోని పాదబాటపై ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ ఈ నెల 16న కనిపించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీసీ రాజు, డీఈ మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని దోమల్‌గూడలో నివసించే మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం అమ్మసాగరానికి చెందిన ముప్పారం జోగయ్య(36)గా గుర్తించారు. విచారించగా, జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ప్రకటనల విభాగంలో పని చేస్తున్న అరుణ్‌కుమార్‌, జైన్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేసే భిక్షపతి సహకారంతో ఈ పని చేసినట్లు అంగీకరించాడు. ఇనుప ఫ్రేమ్‌ను తుక్కుగా మార్చి రూ.45 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుణ్ని రిమాండ్‌కు తరలించి, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

Murder: చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. నరికి చంపిన అన్న

ABOUT THE AUTHOR

...view details