ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం - ఏపీ లేటెస్ట్ న్యూస్

physically-handicaped-women-raped-at-vishaka-district
విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం

By

Published : Sep 22, 2021, 9:48 AM IST

Updated : Sep 22, 2021, 12:38 PM IST

09:46 September 22

వైకాపా నాయకుడు వెంకట్రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

విశాఖపట్నం జిల్లాలో ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలే పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో వైకాపా నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వైకాపా రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకుని పోలీసులు ప్రెస్​మీట్లు పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే... తామేమీ తక్కువ తినలేదంటూ వైకాపా నేతలు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. 

      సభ్యసమాజం తలదించుకునేలా విశాఖ వైకాపా నాయకుడు వెంకట్రావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని లోకేష్ పేర్కొన్నారు. సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమన్నారు. పోలీసులకు చేతనైతే... నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

ఇదీ చూడండి:అవసరం లేకున్నా సిజేరియన్లు... ప్రభుత్వాసుపత్రుల్లో 34%, ప్రైవేటులో 66% కోతలు

Last Updated : Sep 22, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details