ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

RTC bus accident: తెలంగాణలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు - వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

తెలంగాణం రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు(rtc bus accident) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో (rtc bus overturned in telangana) 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

bus accident in telangana
తెలంగాణలో ఆర్టీసీ బస్సు బోల్తా

By

Published : Nov 12, 2021, 3:33 PM IST

తెలంగాణంలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదాని(rtc bus accident)కి గురైంది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న బస్సు.. కల్కొడ చౌరస్తా వద్ద ఒక్కసారిగా బోల్తా (RTC bus rolled over) పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.

అతి వేగమే కారణం..!

ఈ ప్రమాదానికి అతి వేగమే(over speed of bus) కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కల్కొడ గ్రామం సమీపంలో రహదారి ఎత్తుపల్లాలను డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. అప్పటికే వేగంలో ఉన్న బస్సును కంట్రోల్ తప్పింది. ఈ క్రమంలోనే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా(rtc bus overturned in vikarabad district) పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో.. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా.. ప్రయాణికుల ఆర్తనాదాలతో మారుమోగింది.

ఇదీ చూడండి:

Road accident in Nalgonda: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. 8 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details